భారత్, కెనడా వివాదంలో మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా శ్రీలంక కూడా మనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా, స్వర్గధామంగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో శ్రీలంకపై కూడా కెనడా తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు తననేమి ఆశ్చర్యానికి గురి చేయాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa