ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో మంగళవారం కేవీఎస్ ట్రస్టు, వైఎం హెచ్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కేవీ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది అందించే కేవీఎస్ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది కేవీఎస్ పురస్కారాన్ని నాట్యరంగంలో విశిష్ట ప్రతిభ కలిగిన నాట్యగురువు, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్య విభాగాధిపతి డాక్టర్ వనజ ఉదయ్‌కు అందించి ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథులుగా మండలి బుద్దప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి విచేచసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్దప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని, కేవీఎస్ పుట్టినరోజు కూచిపూడి నాట్యానికి పర్వదినం అన్నారు. పలు నృత్య సంస్థల చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యం అలరించింది.