హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశాడని కేటీఆర్ గతంలో అన్నారని , హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతించాలని కేటీఆర్‌ను లోకేశ్ అడిగారని.. హైదరాబాద్‌లో మీకేం పని అని కేటీఆర్ అనడం దారుణమని మాజీ మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఏపికి ఇంకా హక్కు ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు చేస్తున్నారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చెల్లులు షర్మిల.. కేసీఆర్‌ను రోజూ తిడుతుందని... తెలంగాణలో మీకేం పని షర్మిలాని అన్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ కలిసిపోయిందా అని నిలదీశారు.