నేడు తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... నారా లోకేశ్ కంతేరులో భూములు కొన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో భూములు కొనాలని 2014 మార్చి 21న నిర్ణయించారన్నారు. 2014 మార్చి 21 నాటికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా? అని ప్రశ్నించారు. మార్చి 21 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారని.. మార్చి 2014 నాటి తీర్మానాన్ని, సీఎం జగన్ ఒకసారి చూడాలన్నారు. రాజధాని ముందే ఊహించి కుట్రపూరితంగా భూములు కొన్నారంటున్నారని.. అప్పటికి ఎన్నికలే జరగలేదని.. ఏ ప్రభుత్వం వస్తుందో కూడా తెలియదని పట్టాభి వ్యాఖ్యానించారు. బోర్డు మీటింగ్‌లో కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలుకు తీర్మానం చేశారని, 2014 జులై 1న కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. జులై 31న మరికొంత భూమి కొనుగోలు చేశారని చెప్పారు.