గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో నేడు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భవః ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పొన్నూరు ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ రేష్మ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ స్పెషలిస్టులు పాల్గొని 11 రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించబడునని ఆమె పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.