బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కావని మనందరికీ తెలుసు. మనం అక్కడ ఉండకపోయినా సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల కావేరీ జలాల సమస్య కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం బంద్ నిర్వహించడంతో బుధవారం బెంగళూరు నగరంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు చిక్కుకుపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. అయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక డెలివరీ బాయ్ అద్భుతం చేశాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేయగా.. అంత ట్రాఫిక్‌లోనూ సమయానికి బైక్‌పై వచ్చి ఆ డెలివరీ బాయ్ పిజ్జాను అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెంగళూరు రోడ్లపై ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను చూసి వాహనదారులు బుధవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. అయినప్పటికీ ఓ పిజ్జా డెలివరీ బాయ్ అరగంటలో పిజ్జా డెలివరీ చేసి వావ్ అనిపించుకున్నాడు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ఆకలితో డోమినోస్ నుంచి పిజ్జాను ఆర్డర్ చేశాడు. పిజ్జా డెలివరీ కావడానికి అరగంట సమయం చూపించింది. ఇక తాను ఉన్న చోటును డెలివరీ బాయ్‌కి లైవ్ లొకేషన్ ద్వారా పంపించగా.. చివరికి అరగంటలోనే ఆ వ్యక్తి వచ్చి పిజ్జాను డెలివరీ చేశాడు.
ఇక సమయానికి తనకు పిజ్జా డెలివరీ చేసిన దృశ్యాలను ఆ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. అది చూసిన నెటిజన్లు ఆ డెలివరీ బాయ్ చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సందర్బంగా నెటిజన్లు హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ సీన్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అందులో బ్రహ్మానందంకు చెందిన పిజ్జా స్టోర్‌లో అల్లు అర్జున్ పనిచేస్తాడు. అయితే సమయానికి పిజ్జా డెలివరీ చేయకపోతే జీతంలో కోత పడుతుందని బ్రహ్మానందం రూల్. దీంతో ఎంత కష్టమైనా డెలివరీ బాయ్‌లు సమయానికి డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి రోడ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో టైమ్‌కు పిజ్జా డెలివరీ చేయాలని.. తన స్పోర్ట్స్ బైక్‌తో విన్యాసాలు చేస్తూ వాహనాల మధ్య నుంచి పై నుంచి వెళ్లి సమయానికి పిజ్జాను డెలివరీ చేస్తాడు. దీంతో హ్యాపీ సినిమా సీన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెటిజన్లను ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు.