మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిపోవడం, మన రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లిని సాగు చేస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు పూర్తిగా తగ్గిపోవడంతో ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటం ఉల్లి ధర గరిష్టంగా రూ.2,626లకు చేరింది. శుక్రవారం మధ్యస్థ ధర రూ. 2,309, కనిష్ఠ ధర రూ.1,580లకు ధర పలికింది. దీంతో రైతులు సంతో షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి రైతులు తెచ్చిన వాముకు గరిష్టంగా క్వింటంపై రూ.18,110 ధర లభించింది. మధ్యస్థ ధర రూ.1,4,110, కనిష్ఠ ధర రూ.7,680 లభించింది. వేరుశనగ కాయలు క్వింటానికి గరిష్ఠంగా రూ.8,159, మద్యస్థ ధర రూ.6,799, కనిష్ఠ ధర రూ.4,042కు పడిపోయింది.