యూపీలోని ఫిరోజాబాద్‌లో సోమవారం దారుణం జరిగింది. టీ స్టాల్లో డబ్బులు దొంగతనం చేశాడనే ఆరోపణలతో 12 ఏళ్ల బాలుడిని కొందరు విచక్షణా రహితంగా కొట్టారు. స్తంభానికి నగ్నంగా కట్టి, దాడి చేశారు. తాను దొంగతనం చేయలేదని, తనను వదిలి పెట్టాలని ఆ బాలుడు ఏడుస్తూ వేడుకున్నాడు. అయినా వారు కనికరించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.