స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. 6వ నెంబర్ కోర్టులో ఐటెం నెంబర్ 63గా చంద్రబాబు పిటిషన్ను లిస్ట్ చేశారు. కాగా, కోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.