15 మీడియా సంస్థలు సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. జర్నలిస్టులు రాసే అన్ని వార్తలను ప్రభుత్వాలు అంగీకరించడంలేదని, జర్నలిస్టులు ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. పాత్రికేయులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కూడా కోరుకోవడం లేదన్నారు. న్యూస్ క్లిక్ పై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే.