ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ హైకోర్టును కోరారు. ఫైబర్ నెట్ కేసులో బాబు పాత్రపై కీలక ఆధారాలున్నాయని.. నిర్ణయాలను అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని వాదనలు వినిపించారు. విచారణలో చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించామని.. అందుకే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్నారు. బాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఏజీ పేర్కొన్నారు.