ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలను పెంచే లక్ష్యంతో మూడు సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గురువారం అమరావతి సచివాలయంలో ఫుడ్ ప్రొసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవ్‌చౌదరి సమక్షంలో సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి ఆయా సంస్థల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ కింద ఆంధ్ర గ్రామీణ బ్యాంకు ఒక్కో లబ్ధిదారునికి రూ.10లక్షల వరకు రుణ సహాయం చేయనున్నది. వచ్చే మార్చిలోగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐదు వేల యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్ర గ్రామీణ బ్యాంకుతో ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ఒప్పందం చేసుకుంది. అలాగే ఇండోర్‌లోని రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటతో మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఎంవోయూ చేసుకుంది.