కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ–ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్) చట్టం–1956లో సెక్షన్–1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2కు మరిన్ని విధి విధానాల జారీకి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.