ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు వేగానికి ఎగిరిపడి రైతు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 08:00 PM

ఒక్కోసారి దురదృష్టం మృత్యువు రూపంలో వెంటాడుతుంటుంది.. అది ఏ రూపంలోనైనా రావొచ్చు. ఇలాంటి ఘటనలో గతంలోనే చాలానే చూశాం. రోడ్డుపై వెళుతుంటే సడన్‌గా వాహనం వచ్చి ఢీకొట్టడం.. పై నుంచి ఏదొకటి తలపై పడటం.. గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తాజాగా ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. పట్టాల పక్క నుంచి నడిచి వెళుతున్న వ్యక్తి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది.


బొబ్బిలి మండలం పాతపెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి శుక్రవారం సమీపంలో ఉన్న పట్టాల పక్క నుంచి పొలానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈక్రమంలో రైలు వచ్చింది.. ఆ వేగానికి ఎగిరిపడి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న చందాన కార్తీక్‌ అనే గ్రామస్తుడు గమనించి తిరుపతి కుమారుడు రామకృష్ణకు సమాచారం అందించాడన్నారు. ఇద్దరూ కలిసి తిరుపతిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కానీ అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడటంతో ప్రాణాలు పోయాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.. చనిపోయిన రైతుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa