దసరా సందర్భంగా మదనపల్లె ఆర్టీసీ డిపో-2 పలు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా మదనపల్లె నుంచి బిహెచ్ఈఎల్ కు అల్ట్రా డీలక్స్ స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు డిపో మేనేజర్ నిరంజన్ ఆదివారం తెలిపారు. ఈనెల 18వ తేది నుంచి 23వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa