ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత లోకేశ్ నేడు అనగా మంగళవారం సీఐడీ అధికారుల ముందు హాజరు కానున్నారు. ఇందుకోసం సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనను 14వ నిందితునిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ నెల 10న ఆయన సీఐడీ అధికారుల ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆయనను విచారించవచ్చని, ఆ సమయంలో ఆయన న్యాయవాదులు ఉండవచ్చని కోర్టు ఆదేశించింది.