2024 మార్చిలో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుదామని వైసీపీ నేతలకు సీఎం జగన్ పిలుపిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన వైసీపీ ప్రజాప్రతినిధుల సమరభేరి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని, తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు.