ప్రజలందరి ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పాలన కొనసాగిస్తున్నారని టిటిడి బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి సచివాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.