పుంగనూరు- తిరుపతి సర్వీసులో చంద్రగిరి మండలం గడ్డకింద పల్లెకు చెందిన చంగల్ రాయు నాయుడు తనకు చెందిన రూ. 50 వేల నగదును జారవిడుచుకుని వెళ్లిపోయాడు. కండక్టర్ వినాయకం ఫుట్ బోర్డు వద్ద ఈ నగదు లభించడంతో విచారించగా అందుకు సంబంధించిన వారు బస్సులో ఎవరూ లేరని ప్రయాణికులు తెలిపారు. తిరిగి చెంగల్రాయ నాయుడు డిపో వద్దకు వచ్చి విచారించడంతో మేనేజర్ అతనికి నగదు అందజేశారు. పలువురు కండక్టర్ ను అభినందించారు.