యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష అందజేత. రెండోది: సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రూ.50 వేలు ప్రోత్సాహకం.