గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పలువురికి ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. గ్రీన్‌కార్డ్ అభ్యర్థులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ కూడా 5 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న వేల మందికి లబ్ది చేకూరనుంది.