విజయనగరం ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గొప్ప మనసు చాటుకున్నాడు. బస్స్టాపులో ఓ వృద్దురాలి కష్టాన్ని చూసి ఆ కానిస్టేబుల్ చలించిపోయిన అతడు వృద్దురాలికి చెప్పులు కొనివ్వడమే కాదు జ్యూస్ కూడా కొనిచ్చాడు. వివరాలు విజయనగరం బస్స్టాండ్ వద్ద సురేష్ అనే కానిస్టేబుల్ శనివారం (అక్టోబర్ 14) విధులు నిర్విర్తిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ దగ్గర ఓ వృద్దురాలు కాళ్లకు చెప్పులు లేక ఎండలో బోబ్బలు వచ్చిన కాళ్లతో నడలేక ఇబ్బంది పడింది. ఆకలితో ఎండలో నిరసించి నడవలేక కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను చూసి సురేష్ చలించిపోయాడు. దీంతో ఆమెకు కొత్త చెప్పులు కొనిచ్చి జ్యూస్ తాగించి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. అంతేకాదు ఆమె అడ్రస్ కూడా తెలుసుకుని వృద్దురాలిని ఇంటికి పంపించాడు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ గొప్ప మనసుకు ప్రతి ఒక్కరు అతడిపై ప్రశంసిస్తున్నారు.