గుంటూరులో విచిత్రమైన ఘటన జరిగింది. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది.. దీంతో యజమాని దానిని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు.. కడుపులో రాళ్లు ఉన్నాయని గుర్తించడంతో అవాక్కయ్యారు. కుక్కు సర్జరీ చేయగా ఏకంగా 252 రాళ్లు బయటపడ్డాయి. గుంటూరుకు గుమ్మడి శేషగిరిరావు ఏడేళ్ల వయసు కలిగిన లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఆడకుక్కను పెంచుకుంటున్నారు. గత నెల 26న కుక్క మూత్రం నుంచి రక్తం రావడంతో విజయవాడలోని ఎన్టీఆర్ సూపర్‌స్పెషాలిటీ పశువైద్యశాలలో చూపించారు. అక్కడ డాక్టర్ కామని శ్రీనివాసరావు స్కానింగ్ తీయించగా.. కుక్క కడుపులో రాళ్లు ఉండటం గమనించి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. గత నెల 28న శస్త్రచికిత్స చేసి మూత్రాశయం, మూత్రనాళం నుంచి 252 రాళ్లు బయటకు తీశారు. కుక్క కడుపులో ఇన్ని రాళ్లు ఉండటం అరుదుగా చూస్తుంటామని డాక్టర్లు చెబుతున్నారు. సర్జరీ అనంతరం కుక్క ఆరోగ్యంగా ఉందని యజమాని శేషగిరిరావు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కుక్కు ఈ సర్జరీ చేయగా.. ఇటీవలే ఆ శునకం కోలుకోవడంతో యజమాని ఇప్పుడు వివరాలు తెలియజేశారు.