నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో ఆదివారం అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో గల అమ్మవారి విగ్రహాలను ట్రాక్టర్ల పై నిర్వాహకులు తరలించారు. ఊరేగింపుకు ముందు డప్పు వాయిద్యాలు మేళతాళాలు, మహిళలు కలశాలును తలపై పెట్టుకుని తరలి వెళ్లారు. పలువురు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు.