టీడీపీ అధినేత చంద్రబాబుకు చర్మ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని.. జైలులో కొత్తగా ఏమీ రాలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 'ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారని విషప్రచారం చేస్తున్నారు. ఆయన 5 కిలోలు తగ్గారని కుటుంబసభ్యులే అబద్ధాలు ఆడుతున్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు. బాబుకు ఏసీ కావాలని జైలుకు వెళ్లినప్పుడే ఎందుకు అడగలేదు' అని అంబటి ప్రశ్నించారు.