మంగళగిరి ఆంజనేయ కాలనీ ఐదవ లైనుకు చెందిన చింతక్రింది గంగాధరరావు భార్య విజయలక్ష్మి (59) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల వైద్యులుగుండె శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో రెండు రోజుల క్రితం ఇంట్లోనుండి కనిపించకుండా వెళ్లి ఇందిరానగర్ లో పాడుపడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలుపలకు తీసారు.