ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్వలింగ పెళ్లిళ్ల చట్టబద్ధతపై సుప్రీంలో అఫిడవిట్ సమర్పించింది. 'భారత పురుషుడు పెళ్లి తర్వాత భర్త, స్త్రీ భార్య అవుతుంది. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులవుతారు. వివాహ చట్టానికి అనేక హక్కులు, బాధ్యతలున్నాయి. స్వలింగ సంపర్కులు భాగస్వాములుగా జీవించడం నేరం కాదు. దీన్ని భర్త, భార్య పిల్లలతో కూడిన భారతీయ కుటుంబంతో పోల్చలేం.. ఈ వివాహానికి చట్టబద్ధత కల్పించలేం' అని తెలిపింది.