పుట్లూరు మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పుట్లూరు బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పుట్లూరులో ఆయన మాట్లాడుతూ మండలానికి హెచ్ఎల్సీ కాలవ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు, పిల్లులు ఆడుకోవడానికి పార్కు, హిందూ దేవాలయల అభివృద్ధి, ఐటీఐ కాలేజీ, కనీసం 1000 మందికి ఉపాధి లభించే పరిశ్రమలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.