IRR కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసంన.. తాజాగా దాన్ని నవంబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. IRR కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.