పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి నగరంలోని విద్యుత్ శాఖ ఏడిఈ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి వినియోగదారులపై వేల కోట్ల బారాలు మోపిందని విమర్శించారు. పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa