కర్ణాటకలోని మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్‌పై కొందరు మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ కారు వారిపై దూసుకెళ్లింది. మహిళలపై కారు ఎక్కించి అంతే వేగంతో పరారయ్యాడు. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa