ఇజ్రాయెల్ గాజా ఆస్పత్రిపై దాడి చేసిందని వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారి వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. 'ప్రాధమికంగా ఇజ్రాయెల్ చేసిన దర్యాప్తులో పేలిన రాకెట్ కార్ పార్కింగ్ వద్ద జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఈ పేలుడు వల్ల ఎవరు మృతి చెందినట్లు కనిపించలేదన్నారు. కేవలం అక్కడ 15 కార్లు మాత్రమే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. 500 మంది నిజంగానే చనిపోయి ఉంటే వారి మృతదేహాలు ఏమైయ్యాయని ప్రశ్నించారు.