తాడిపత్రి మండలం హీరాపురం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ నిర్వహించారు. సబ్ స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ సరఫరాలో సమస్యలు తొలగిపోనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ టీసీ రమణమ్మ, వైఎస్సార్సీపీ నేత సుంకిరెడ్డి, తహసీల్దార్ మునివేలు, ట్రాన్స్కో ఏడీఈ రఘు, ఏఈ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.