ప్రతి కుటుంబంలో మార్పు కనిపిస్తే..అది మా జగనన్న పాలన, మనందరి పాలన అంటారని సీఎం జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఈ 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నానని చెప్పారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయన్నారు. ప్రతీ అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపిస్తున్నామన్నారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం కొన్ని వేల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాని చెప్పారు. ‘‘వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమం గురువారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.