రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగంలో నైపుణ్యాలను పెంచితే అది మన దేశానికి స్వయంసమృద్ధి సాధించడంలో దోహదపడుతుందని అన్నారు. మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. దేశాభివృద్ధికి అవసరమయ్యే రంగాలు పెంచాలని చెప్పారు.