సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు నవూఫ్ అల్మరీ యోగా దినోత్సవం రోజున పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. యోగా మనసును శుద్ధి చేస్తుందని అంటోంది. ఆయుర్వేద జ్ఞానాన్ని సౌదీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది తన ఆలోచనని తెలిపారు. తాజా భారత పర్యటనలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించి శిల్ప కళను రాతితో మలిచిన కావ్యంగా అభివర్ణించారు. మన ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.