హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని రష్యా, హమాస్ చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలకు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందన్నారు. రష్యా, హమాస్ ఉగ్రవాదుల లక్ష్యం ఒకటేనని అన్నారు.