టీడీపీ హయాంలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కుల కార్పొరేషన్లు తప్ప ఎక్కడా బీసీ ప్రాతినిధ్యం కనిపించడం లేదని టీడీపీ నేత కొల్లు రవీంధ్ర అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీ మంత్రులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న దాఖలాలున్నాయా?.. రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం బీసీలను ఉద్దరించడమా?అని ప్రశ్నించారు. 8వేల ఎకరాల బీసీ అసైన్డ్ భూములు లాక్కున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని అయన అన్నారు.