టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో కలవడానికి ములాఖత్‌లను పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను కలవడానికి కుటుంబ సభ్యులకు వారానికి రెండు ములాఖత్‌లు, న్యాయవాదులు కలవడానికి రోజుకు రెండు ములాఖత్‌లు ఉండేవని, అయితే న్యాయవాదులకు ఇచ్చే ములాఖత్‌ను ఒక్కటి కుదించారని తెలిపారు. కేసులపై ఆయనతో చర్చించేందుకు రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వీరి వాదన విన్న కోర్టు ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించలేదు.