టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ‘ బాబుతో నేను సైతం’ అంటూ నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లు చేతబట్టి సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ....... ఓటమి భయంతో రాజకీయ కక్ష సాధింపుతో జగన్రెడ్డి చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి 40 రోజుల నుంచి జైలులో ఉంచి పైశాచిక ఆనందం పొందుతున్నాడన్నారు. ప్రజల ఆశీస్సులతో అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.