వ్యవసాయ రంగానికి రోజూ 9గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని తెలుగు రైతు విభాగం రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగురైతు నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ....... వ్యవసాయానికి కోతలు విధిం చకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం కోతలు విధిస్తూ ఏడు గంటలైనా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలో వరి, చెరకు, మొక్కజొన్న, కూరగాయలు, ఆయిల్‌పామ్ పంటలకు ఆరు తడులు అందించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యుత్ వినియోగదారులపై గడి చిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.57 వేల కోట్లు భారం వేసిందన్నారు. వ్యవసాయానికి కోతలు విధించ కుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.