సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు.