తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వెలసిన శ్రీ రాజేశ్వరి దేవి అమ్మవారు నేడు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల వేడుకలలో భాగంగా ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.