ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పునః ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 05:04 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నవంబరు 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దీనిని పార్టీ యువనేత నారా లోకేశ్‌ ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడులో తెలుగుదేశం పార్టీ ఆరు హామీలను ప్రకటించింది. ఈ హామీలను తప్పకుండా అమలు చేస్తామంటూ పార్టీ అధినేత చంద్రబాబు సంతకంతో కూడిన బాండ్లను పార్టీ ముద్రించింది. టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఆ హామీల ప్రకారం ఆ ఇంటికి ఎంత మొత్తం అందుతాయో లెక్క వేసి బాండ్లపై రాసి తాము కూడా సంతకం చేసి అందిస్తారు. అధినేత హామీలను ప్రచారం చేయడంతోపాటు వాటిపై ప్రజల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa