గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2024లో సీఎం అవుతారని కొందరు టీడీపీ నేతలు కలలగంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ రాజకీయ పరిస్థితులు చూడ నిరాకరిస్తున్న బాబు గారి అభిమానులు గమనించాల్సిన నిజం ఏమంటే–సుదీర్ఘ చరిత్ర ఉన్న తమిళనాడు డీఎంకేకు, ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పోలిక లేదు. ప్రజా ఉద్యమాల్లో రాటుదేలిన పోరాట యోధుడు, గొప్ప రచయిత అయిన కరుణానిధికి, కుప్పం ఎమ్యెల్యే నారా వారికి మధ్య పోల్చదగిన ఎలాంటి ఉమ్మడి రాజకీయ లక్షణాలు లేవు. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానులు, బాబు గారి భజనపరులు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే వారి ఆరోగ్యానికి మేలు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు.