భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలని మంత్రి ఆర్కే రోజా సూచించారు. మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. అర సున్న, అర సున్న కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశానిర్దేశం చేశారంటూ టీడీపీ, జనసేన మీటింగ్‌పై మంత్రి రోజా సెటైర్లు విసిరారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పవన్,లోకేష్ ఇద్దరినీ ప్రజలు ఓడించారు. ఇదేమీ కర్మరా బాబూ అని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో మేం ఇది చేశామని ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుంది.. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌పై నిజం గెలవాలని సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్‌లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయట పడతారు. పవన్, లోకేష్‌ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్‌కి ఇటు ఒక బ్యాచ్, అటు ఒక బ్యాచ్ కూర్చుకుని సెలక్ట్ చేసినట్లు ఉందంటూ రోజా చురకలు అంటించారు.