ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల సబ్సిడరీలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బోర్డులో ఎండీ, సీఈవోతో పాటు ఇద్దరు హోల్టైం డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే సీనియర్ మేనేజ్మెంట్ బృందం అవసరమని పేర్కొంది. ఇప్పటి నుంచి 4నెలల్లోగా హోల్ టైం డైరెక్టర్ల నియామకంపై ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.