అమెరికా అందించే అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ లను వరించాయి. ఈ సందర్భంగా గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి.ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురిని బైడెన్ పొగడ్తలతో ముంచెత్తారు.