కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం బాగేపల్లి, చిక్కబళ్లాపూర్ మార్గంలో 44వ జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టడంతో టాటా సుమోలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. మృతులు ఏపీ లోని శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.