సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కొడే కండ్ల- జ్వాలాపురం గ్రామాల మధ్యలో ఉన్న దుర్గమ్మ గుడి సమీపంలో గురువారం తెల్లవారుజామున చిరుతపులి కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుడి సమీపంలో చిరుతపులి ఉండగా గ్రామస్తులు కనుగొని కేకలు పెట్టడంతో ముళ్లపొదల్లోకి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే బోన్లు ఏర్పాటుచేసి వాటిని బంధించాలని కోరుతున్నారు.